jagan: వైసీపీ గెలిస్తే ఏపీ ఎడారిగా మారుతుంది: కనకమేడల

  • పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టులను మూసేయాలని టీఆర్ఎస్ కోరుతోంది
  • పోలవరం ప్రాజెక్టుపై పిటిషన్లు వేస్తోంది
  • అలాంటి పార్టీతో జగన్ చేతులు కలిపారు

స్వార్థ రాజకీయాల కోసం టీఆర్ఎస్ తో చేతులు కలిపి... ఏపీని ఎడారిగా మార్చేందుకు వైసీపీ నేత జగన్ కుట్ర చేస్తున్నారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టులను మూసేయాలని ఓ వైపు టీఆర్ఎస్ చెబుతోందని... ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ రాయలసీమలోని పంట పొలాలను బీళ్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని సుప్రీంకోర్టులో టీఆర్ఎస్ ప్రభుత్వం పిటిషన్లు వేస్తోందని అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను తమకు అప్పగించాలని కోరుతోందని చెప్పారు. అలాంటి పార్టీతో అంటకాగుతున్న జగన్... రాష్ట్రానికి తీరని అన్యాయం చేసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు.

jagan
ysrcp
kanakamedala
Telugudesam
  • Loading...

More Telugu News