kesavireddy: ‘కేశవరెడ్డి’ బాధితులకు టీడీపీ ప్రభుత్వం న్యాయం చేయలేదు: వైఎస్ జగన్

  • మేము అధికారంలోకొస్తే న్యాయం చేస్తాం
  • ‘కేశవరెడ్డి’ విద్యా సంస్థల ఆస్తులను అమ్ముతాం
  • మోసం చేయడం చంద్ర బాబుకు అలవాటే

కేశవరెడ్డి విద్యా సంస్థల బాధితులకు టీడీపీ ప్రభుత్వం న్యాయం చేయలేదని, వైసీపీ ప్రభుత్వం వస్తే ఆ బాధితులను ఆదుకుంటామని వైసీపీ అధినేత జగన్ హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా నంద్యాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కేశవరెడ్డి విద్యా సంస్థల ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేస్తానని అన్నారు. ఉపఎన్నికలో టీడీపీ ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని, ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పిన చంద్రబాబు ఆ మాటే మర్చిపోయారని అన్నారు. మోసం చేయడం చంద్రబాబుకు అలవాటైపోయిందని విమర్శించారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ చంద్రబాబు అనేక కుట్రలు చేస్తున్నారని, ప్రతి గ్రామానికి మూటలమూటలు డబ్బులు పంపి ఓటర్లను కొనుగోలు చేయాలని బాబు చూస్తున్నారని ఆరోపించారు.

kesavireddy
YSRCP
jagan
nandyala
Telugudesam
  • Loading...

More Telugu News