sharmila: అందుకే షర్మిల ఉంగరాన్ని కొట్టేశారని జనాలు చెప్పుకుంటున్నారు: టీడీపీ నాయకురాలు అనురాధ

  • చంద్రబాబు అహంభావి అనడానికి ఒక్క ఉదాహరణ అయినా చెప్పగలరా?
  • శ్రీలక్ష్మి గురించి షర్మిల మాట్లాడాలి
  • ఎండదెబ్బ తగిలి పిచ్చిపిచ్చిగా వాగుతున్నారు

వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిలపై టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అహంభావి అని చెప్పడానికి ఒక్క ఉదాహరణ అయినా చెప్పగలరా అని ప్రశ్నించారు. ఆడవారి గురించి మాట్లాడుతున్న షర్మిల... జగన్ వల్ల జైలుకెళ్లిన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. శ్రీలక్ష్మి గురించి షర్మిల మాట్లాడాలని డిమాండ్ చేశారు. జగన్ లక్ష కోట్లు కొట్టేసినందుకే... షర్మిల ఉంగరాన్ని ఎవరో కొట్టేశారని జనాలు చెప్పుకుంటున్నారని అన్నారు. ఎండదెబ్బ తగిలి షర్మిల పిచ్చిపిచ్చిగా వాగుతున్నారని విమర్శించారు.

sharmila
anuradha
jagan
Telugudesam
ysrcp
  • Loading...

More Telugu News