Kodali Nani: కొడాలి నానిపై సాధినేని యామిని ఫైర్

  • అసెంబ్లీలో ఏనాడైనా ప్రజాసమస్యలను ప్రస్తావించారా?
  • కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు
  • అవినాశ్ ఘన విజయం సాధించడం ఖాయం

15 ఏళ్లుగా గుడివాడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఏనాడైనా అసెంబ్లీలో ప్రజాసమస్యలను ప్రస్తావించారా? అని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని ప్రశ్నించారు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ, ప్రజాసమస్యలను పట్టించుకోని కొడాలి నాని... ఇప్పుడు మళ్లీ ఓట్లు అడుగుతుండటం సిగ్గు చేటని అన్నారు. గుడివాడలో టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాశ్ ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పారు. విద్యావంతుడు, మృదు స్వభావి అయిన అవినాశ్ ను గెలిపిస్తే గుడివాడ పదింతల అభివృద్ధిని సాధిస్తుందని అన్నారు.

నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తానేంటో నిరూపించుకోవాల్సింది పోయి... అర్థంలేని మాటలు మాట్లాడుతున్నారంటూ నానిపై యామిని మండిపడ్డారు. రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబును విమర్శించడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమని చెప్పారు. కులాల మధ్య చిచ్చురేపుతున్నారని మండిపడ్డారు. బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని అవినాశ్ తనతో చెప్పారని అన్నారు.

Kodali Nani
devineni avinash
sadineni yamini
gudivada
ysrcp
Telugudesam
  • Loading...

More Telugu News