Andhra Pradesh: మైలవరం సభలో దేవినేని పూర్ణ మా కార్యకర్తలపై రాళ్లు, చెప్పులు విసిరి రెచ్చగొట్టాడు!: వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్

  • మైలవరంలో అలజడులు సృష్టించేందుకు యత్నించారు
  • వైసీపీ కార్యకర్తలను నేను సముదాయించాను
  • పోలీసులు మాపైనే కేసులు పెడుతున్నారు

మైలవరంలో అలజడులు సృష్టించి లబ్ధిపొందేందుకు టీడీపీ నేత, మంత్రి దేవినేని ఉమ ప్రయత్నిస్తున్నారని మైలవరం వైసీపీ ఇన్ చార్జి వసంత కృష్ణప్రసాద్ విమర్శించారు. దేవినేని ఉమ అనుచరుడు దేవినేని పూర్ణ వైసీపీ కార్యకర్తలపై చెప్పులు, రాళ్లు విసిరి రెచ్చగొట్టాడని ఆరోపించారు. దీంతో అక్కడే ఉన్న తాను వైసీపీ శ్రేణులను సముదాయించానని వ్యాఖ్యానించారు.

కానీ పోలీసులు మాత్రం వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదుచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వసంత కృష్ణప్రసాద్ మాట్లాడారు. టీడీపీ నేత దేవినేని ఉమ ఇప్పటికైనా పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని కృష్ణప్రసాద్ హితవు పలికారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఏపీలో వైసీపీ విజయాన్ని ఆపలేరని జోస్యం చెప్పారు.

Andhra Pradesh
Krishna District
milavaram
Telugudesam
YSRCP
uma
krishna prasad
  • Loading...

More Telugu News