Andhra Pradesh: జనసేన ఎన్నికల మేనిఫెస్టోపై స్పందించిన హీరో రామ్ చరణ్!

  • మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు
  • ఇది నిజంగా అద్భుతంగా ఉంది
  • పవన్, జనసేన అభ్యర్థులకు అభినందనలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ నిన్న ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన మేనిఫెస్టోపై ప్రముఖ టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్న జనసేన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని రామ్ చరణ్ కితాబిచ్చాడు.

జనసేన ఎన్నికల్లో సరికొత్త ప్రభంజనం సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులందరికి అభినందనలు తెలిపాడు. ఈ మేరకు రామ్ చరణ్ ఫేస్ బుక్ లో స్పందించాడు.

Andhra Pradesh
Jana Sena
Pawan Kalyan
Facebook
manifesto
  • Loading...

More Telugu News