amedhi: అధికారమిచ్చిన వారినే రాహుల్‌ అవమానించారు: బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ

  • పదిహేనేళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు వేరే దారి చూసుకుంటున్నారు
  • ఇది అమేథీ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే
  • ఓటమి భయం వల్లేనని వ్యాఖ్య

అమేథీ ప్రజల్ని రాహుల్‌గాంధీ తీవ్రంగా అవమానించారని, పదిహేనేళ్లు తన అధికారానికి మద్దతు పలికిన వారిని వదిలేసి మరో నియోజకవర్గం చూసుకుంటున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ విమర్శించారు. ఈరోజు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన ఆమె ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌పై విరుచుకుపడ్డారు. పదిహేనేళ్లపాటు అమేథీ ప్రజలు గౌరవించడం వల్లే రాహుల్‌ అధికారం చలాయించగలిగారని గుర్తు చేశారు. కానీ వారి కనీస అవసరాలు కూడా పట్టించుకోకపోవడంతో వారెక్కడ ఓడిస్తారో అన్న భయంతో కేరళలోని వాయినాడ్‌కు పారిపోయారని ఎద్దేవా చేశారు. రెండో నియోజకవర్గాన్ని ఎంచుకోవడం అంటే సొంత నియోజకవర్గం ప్రజల్ని అవమానించడమేనని స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు.

amedhi
smiti irani
Rahul Gandhi
wayanad
  • Loading...

More Telugu News