Andhra Pradesh: నా బాస్, నా దైవం.. పవన్ కల్యాణ్ ఏపీ సీఎం కావాలని ప్రగాఢంగా కోరుకుంటున్నా!: బండ్ల గణేశ్

  • పవన్ నిజాయతీకి నిలువుటద్దం
  • మానవత్వానికి ప్రతిరూపం
  • ఆయన్ను గెలిపించాలని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా

ప్రముఖ నిర్మాత, కాంగ్రెస్ పార్టీ నేత బండ్ల గణేశ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ నిజాయతీకి నిలువుటద్దమనీ, మానవత్వానికి ప్రతిరూపమని వ్యాఖ్యానించారు. తన దైవం, తన బాస్ పవన్ కల్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని తాను ప్రగాఢంగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. తన కోరికను నిజం చేయాలని ఏపీ ప్రజలను కోరారు.

ఈరోజు ట్విట్టర్ లో బండ్ల గణేశ్ స్పందిస్తూ..‘నిజాయతీకి నిలువుటద్దం, మానవత్వానికి ప్రతిరూపం, మంచితనానికి మరో పేరు....నా దైవం, నా బాస్..పవన్ కల్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని నా ప్రగాఢమైన కోరిక. నా ఆశ, నా కోరిక నిజం చేయాలని ఏపీ ప్రజలకు నా హృదయపూర్వక విజ్ఞప్తి.. ఇట్లు మీ బండ్ల గణేష్’ అని ట్వీట్ చేశారు.

Andhra Pradesh
BANDLA GANESH]
Congress
Jana Sena
Pawan Kalyan
Twitter
  • Loading...

More Telugu News