Kerala: కేరళలోని వాయనాడ్‌లో నేడు రాహుల్‌గాంధీ నామినేషన్
- అమేథీతోపాటు దక్షిణాన పోటీ చేస్తున్న ఏఐసీసీ చీఫ్
- కార్యక్రమానికి హాజరవుతున్న ప్రియాంక
- భారీ రోడ్ షోకు ఏర్పాట్లు
కేరళలోని వాయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని సొంత నియోజకవర్గం అమేథీతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రాహుల్ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన వాయనాడ్‌ను సురక్షిత స్ఞానంగా ఎంపిక చేసుకున్నారు.
ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయన తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి సోదరి ప్రియాంకతోపాటు హాజరవుతున్న రాహుల్‌గాంధీ నామినేషన్ దాఖలు చేసే ముందు భారీ రోడ్డు షో నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పార్టీ వర్గాలు చేపట్టాయి.