YSRCP: అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే: సీపీఎస్ తాజా సర్వే

  • వైసీపీకి 121 నుంచి 130 అసెంబ్లీ సీట్లు
  • 45 నుంచి 54కు పరిమితం కానున్న టీడీపీ
  • వైసీపీకి 21 లోక్ సభ సీట్లు, టీడీపీకి 4

ఈ అసెంబ్లీ ఎన్నికల తరువాత ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని సీపీఎస్ (సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్) సర్వే స్పష్టం చేసింది. ఎన్నికల విశ్లేషకుడు డాక్టర్ వేణుగోపాలరావు నేతృత్వంలోని టీమ్ ఈ సర్వేను ప్రకటించింది. ఏపీ ఎన్నికల్లో వైసీపీ 121 నుంచి 130 ఎమ్మెల్యే సీట్లలోను, 21 ఎంపీ సీట్లలోను విజయం సాధిస్తుందని పేర్కొంది. టీడీపీకి 45 నుంచి 54 అసెంబ్లీ సీట్లు, 4 ఎంపీ సీట్లు వస్తాయని, జనసేనకు 1 నుంచి 2 అసెంబ్లీ సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసింది.

రెండు దశల్లో సర్వేను నిర్వహించామని, ఫిబ్రవరి 17 నుంచి 21 వరకూ తొలి దశలో 4.37 లక్షల మందిని, మార్చిలో 27 నుంచి 31 మధ్య జరిగిన రెండో సర్వేలో 3.04 లక్షల మందిని సర్వే చేసి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నామని పేర్కొంది. ఓట్ల శాతం పరంగా చూస్తే, వైసీపీకి 48.1 శాతం, టీడీపీకి 40.1 శాతం, జనసేనకు 8 శాతం ఓట్లు వస్తాయని, కాంగ్రెస్, బీజేపీలు పెద్దగా ప్రభావం చూపబోవని సీపీఎస్ అంచనా వేసింది. జనసేన పార్టీ ప్రభావం ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ జిల్లాపై మాత్రమే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీపీఎస్ ఇచ్చిన సర్వే దాదాపు నిజమైంది. 

  • Loading...

More Telugu News