Sonali Bendre: బతికే అవకాశం కేవలం 30 శాతమేనని వైద్యులు చెప్పినప్పుడు నా గుండె పగిలింది: సోనాలి బింద్రే

  • చనిపోతాననే ఆలోచన రాలేదు
  • సమయం పడుతుందని అర్థమైంది
  • నా శరీరంపై దృష్టి పెడుతున్నా

ఇటీవలే కేన్సర్‌కు చికిత్స తీసుకుని ఇండియాకు వచ్చిన ప్రముఖ నటి సోనాలి బింద్రే తనకు బతికే అవకాశం 30 శాతమేనని అధికారులు తేల్చినపుడు తన గుండె పగిలిందన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకు కేన్సర్ అని తెలిసినప్పటి విషయాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. స్కాన్ ద్వారా తన ఉదర భాగంలో కేన్సర్ కణాలు పూర్తిగా వ్యాపించాయని, బతికే అవకాశం కేవలం 30 శాతమేనని వైద్యులు తేల్చినపుడు తన గుండె పగిలిందన్నారు.

చనిపోతాననే ఆలోచన అయితే తనకు రాలేదని, పూర్తిగా కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని మాత్రం అర్థమైందన్నారు. ప్రస్తుతం తన శరీరంపై ఎక్కువ దృష్టి పెడుతున్నానని, చిన్న చిన్న మార్పుల్ని పట్టించుకుంటున్నానని అన్నారు. కేన్సర్‌తో పోరాడుతున్న మహిళలకు ఆమె సందేశం ఇస్తూ, అది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని, చుట్టూ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉండేలా చూసుకోవాలని అన్నారు. అది ప్రేమానురాగాలు పొందాల్సిన సమయమని సోనాలి తెలిపారు.

Sonali Bendre
India
Scan
cancer
Friends
Family members
  • Loading...

More Telugu News