Vijayawada: సీఎం పదవికి పవన్ కల్యాణ్ అన్ని విధాలా అర్హుడు: మాయావతి

  • ఏపీ ప్రజలు చంద్రబాబు, జగన్ వలలో పడొద్దు
  • జనసేన, బీఎస్పీ, వామపక్షాల కూటమిని గెలిపించాలి
  • కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే

సీఎం పదవికి పవన్ కల్యాణ్ అన్ని విధాలా అర్హుడని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. విజయవాడలో నిర్వహించిన జనసేన పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో జనసేన, బీఎస్పీ, వామపక్షాల కూటమిని గెలిపించాలని కోరారు. ఏపీ ప్రజలు చంద్రబాబు, జగన్ వలలో పడొద్దని, కొత్త నాయకత్వాన్ని ఆదరించాలని మాయావతి కోరారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని, అన్ని వర్గాల ప్రజలను మోదీ మోసం చేశారని ధ్వజమెత్తారు. ‘మోదీ చౌకీదారు కాదు చోరీదారుగా మారారు’ అని ఆరోపించారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి సరైన న్యాయం జరగలేదని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. 

Vijayawada
janasena
Pawan Kalyan
bsp
maya
  • Error fetching data: Network response was not ok

More Telugu News