Kadapa: కడప జిల్లా టీడీపీ అభ్యర్థి నివాసంపై ఐటీ దాడులు

  • మహదేశ్ ఆధ్వర్యంలో తనిఖీలు
  • జగన్, మోదీ కలిసి దాడులు చేయిస్తున్నారన్న పుట్టా
  • టీడీపీ గెలుస్తుందన్న భయంతోనే దాడులు

కడప జిల్లా మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఐటీ అధికారులు దాడులు చేసిన సమయంలో పుట్టా ఎన్నికల ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తోంది. పుట్టా కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. వైఎంఆర్ కాలనీలోని ఆయన నివాసంపై కడప నుంచి వెళ్లిన ఐటీ అధికారి మహదేశ్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి.

ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపడుతున్నట్టు అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఇలాంటి దాడులకు భయపడేది లేదని, టీడీపీ గెలుస్తుందనే భయంతోనే జగన్‌, మోదీ కలిసి ఇలాంటి దాడులు చేయిస్తున్నారని పుట్టా మీడియాకు తెలిపారు. ప్రధాని మోదీ కావాలనే టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.  

Kadapa
Putta sudhakar Yadav
Mydukuru
Mahadesh
Narendra Modi
Jagan
  • Loading...

More Telugu News