Vijayawada: మాయావతి నాకు స్ఫూర్తి: పవన్ కల్యాణ్

  • మోదీ కూడా మాయావతి నుంచి స్ఫూర్తి పొందారు
  • దేశంలో బీఎస్పీ కార్యకర్తలు లేని గ్రామం లేదు
  • ఆదర్శ మహిళ మాయావతి

బీఎస్పీ అధినేత మాయావతి అందరికీ ఆదర్శమని, యూపీలో ధైర్యంగా ఎదురొడ్డి పోరాడిన వ్యక్తి ఆమె అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కొనియాడారు. విజయవాడలోని ఎంబీపీ స్టేడియంలో జనసేన పార్టీ  నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభకు బీఎస్పీ అధినేత మాయావతి కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఓ సామాన్య వ్యక్తి సీఎం కావడం చాలా కష్టంతో కూడుకున్న పని అని, అలాంటిది, మాయావతి ఇప్పటికే నాలుగుసార్లు సీఎం అయ్యారని కొనియాడారు. అంబేద్కర్, కాన్షీరామ్ లాంటి గొప్ప వ్యక్తులు సామాజిక వ్యవస్థలో మార్పులు తెచ్చారని అన్నారు. నాలుగు సార్లు సీఎం గా చేసిన వ్యక్తి మాయావతి తనకు స్ఫూర్తి అని, నరేంద్ర మోదీ కూడా మాయావతి నుంచి స్ఫూర్తి పొందిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలో బీఎస్పీ కార్యకర్తలు లేని గ్రామం లేదని అన్నారు. తమ ఎమ్మెల్యేలు తప్పు చేస్తే బేడీలు వేసి రోడ్డుపై నడిపించిన ఆదర్శ మహిళ మాయావతి అని కొనియాడారు.

Vijayawada
janasena
Pawan Kalyan
bsp
maya
  • Loading...

More Telugu News