nagarjuna: ఎన్నికల తరువాత బరిలోకి 'బంగార్రాజు'

  • 'మన్మథుడు 2' మొదలెట్టిన నాగ్ 
  • 'బంగార్రాజు'కి రంగం సిద్ధం 
  • సొంత బ్యానర్లోనే రెండు సినిమాలు  

నాగార్జున కథానాయకుడిగా కొంతకాలం క్రితం వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా, ఆయన కెరియర్లోనే అత్యధిక లాభాలను తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో నాగార్జున పోషించిన 'బంగార్రాజు' పాత్రను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఈ కారణంగానే ఆ పాత్ర పేరుతో సీక్వెల్ చేయడానికి నాగార్జున రంగంలోకి దిగారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనున్నట్టు వార్తలు వచ్చాయి.

అయితే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున 'మన్మథుడు 2'  ప్రాజెక్టును మొదలు పెట్టేశారు. దాంతో 'బంగార్రాజు' ఇప్పట్లో ఉండకపోవచ్చనే టాక్ వచ్చింది. కానీ తాజాగా ఒక ఆంగ్ల దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ, ఎన్నికల హడావిడి ముగిసిన తరువాత 'బంగార్రాజు' సినిమాను పట్టాలెక్కించనున్నట్టు చెప్పారు. అంటే ఒక వైపున 'మన్మథుడు 2' చేస్తూనే .. మరో వైపున 'బంగార్రాజు' చేస్తారన్న మాట. ఈ రెండు సినిమాలు సొంత బ్యానర్లో రూపొందుతుండటం విశేషం. 

  • Loading...

More Telugu News