Putta Sudhakar Yadav: నమూనా బ్యాలెట్ పేపరుతో ఓటర్‌ను బోల్తా కొట్టించే యత్నం చేస్తున్నారు: వైసీపీపై పుట్టా ఫిర్యాదు

  • టీడీపీ అభ్యర్థికి 2వ నంబర్‌
  • వైసీపీ అభ్యర్థికి 4వ నంబర్‌
  • టీడీపీ అభ్యర్థి నంబర్ మార్చి నమూనా బ్యాలెట్

ఓటర్లను బోల్తా కొట్టించేందుకు కడప జిల్లాలో వైసీపీ ప్రయత్నిస్తోందంటూ మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. నమూనా బ్యాలెట్‌ను రూపొందించి వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. అభ్యర్థుల జాబితా ప్రకారం టీడీపీ అభ్యర్థికి రెండవ నంబర్‌ను, వైసీపీ అభ్యర్థికి నాలుగవ నంబర్‌ను ఈసీ కేటాయించింది. అయితే వైసీపీ రూపొందించిన నమూనా బ్యాలెట్‌లో మాత్రం టీడీపీ అభ్యర్థి నంబర్‌ను మూడుగా చూపించారు. దీనిపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన పుట్టా, వైసీపీ నేతలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Putta Sudhakar Yadav
YSRCP
Telugudesam
Ballot
Kadapa
  • Loading...

More Telugu News