jagan: జగన్, షర్మిల దిగజారుడుతనానికి అది నిదర్శనం: దేవినేని అవినాశ్

  • 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబును విమర్శిస్తున్నారు
  • కొడాలి నాని అరాచకాలు వీధి రౌడీలను మించిపోయాయి
  • గుడివాడలో వైసీపీ ఓటమి ఖాయమని తేలిపోయింది

వైసీపీ అధినేత జగన్, ఆయన సోదరి షర్మిలపై గుడివాడ శాసనసభ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబును షర్మిల విమర్శించడం అత్యంత దారుణమని అన్నారు. చెప్పుకోవడానికి ఏమీ లేకనే చంద్రబాబుపై జగన్, షర్మిల విమర్శలు గుప్పిస్తున్నారని తెలిపారు. ఇది వారి దిగజారుడుతనానికి నిదర్శనమని చెప్పారు. గుడ్లవల్లేరులో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని వీధి రౌడీలను మించిపోయి అరాచకాలు సృష్టిస్తున్నారని అవినాశ్ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని... అందుకే తాము మౌనంగా ఉన్నామని చెప్పారు. గుడివాడలో వైసీపీ ఓడిపోవడం ఖాయమని తేలిపోయిందని... అందుకే కొడాలి నాని అరాచకాలకు తెరలేపారని అన్నారు.

jagan
sharmila
devineni avinash
Chandrababu
Telugudesam
ysrcp
Kodali Nani
gudivada
  • Loading...

More Telugu News