Chinni Krishna: ​​భీమవరంలో పవన్, నరసాపురంలో నాగబాబు ఇద్దరూ ఓడిపోతారు: సినీ రచయిత చిన్నికృష్ణ

  • గతంలో చిరంజీవి ఏం చేశారు?
  • ఇప్పుడు మరో ఇద్దరొచ్చారు
  • ప్రజలు నమ్మరు

ఇటీవలే వైసీపీలో చేరిన టాలీవుడ్ సినీ రచయిత చిన్నికృష్ణ మెగా బ్రదర్స్ పై విమర్శలు గుప్పించారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయనకు లక్షల మంది ఓట్లు వేస్తే ఏం జరిగిందో అందరూ గుర్తుచేసుకోవాలని అన్నారు. ఇప్పుడదే కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులొచ్చి ఓట్లు అడుగుతున్నారని, వాళ్లను ప్రజలు నమ్ముతారా? అంటూ ప్రశ్నించారు. గతంలో పార్టీ పెట్టారని, ఆ పార్టీ ఏమయిందో అందరికీ తెలుసని చిన్నికృష్ణ ఎద్దేవా చేశారు. వైసీపీ తరఫున నరసాపురం నియోజకవర్గంలో చిన్నికృష్ణ ప్రచారం చేయడానికి వచ్చారు. ఈ సందర్భంగా పైవ్యాఖ్యలు చేశారు.

రఘురామ కృష్ణంరాజుకు నాగబాబు ఏ విధంగానూ పోటీకాదని అన్నారు. నాగబాబు ఓటమి ఖాయమని, అటు భీమవరంలో పవన్ కూడా ఓడిపోతారని తెలిపారు. పవన్ కల్యాణ్ పై వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్ ఘనవిజయం సాధిస్తారని చిన్నికృష్ణ ధీమా వ్యక్తం చేశారు. అభిమాన హీరోల సినిమాలు పదిసార్లు చూసినా తమ ఓటు మాత్రం వైసీపీకే వేయాలని యువతకు పిలుపునిచ్చారు. అంతిమంగా జగన్ పార్టీదే విజయం అని, ఆయన సీఎం కావడం తథ్యం అని స్పష్టం చేశారు.

Chinni Krishna
Tollywood
Pawan Kalyan
Nagababu
  • Loading...

More Telugu News