Telangana: టీఆర్ఎస్ ఎంపీలు నోరు కూడా మెదపరు.. నన్ను గెలిపిస్తే నల్గొండను స్మార్ట్ సిటీగా చేస్తా!: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • టీఆర్ఎస్ కు కేంద్రం సహకరిస్తోంది
  • ఫెడరల్ ఫ్రంట్ ప్రధాని అభ్యర్థి ఎవరో కేసీఆర్ చెప్పాలి
  • నల్గొండలో మీడియాతో టీపీసీసీ చీఫ్

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) నేతలను ఎన్నికల్లో గెలిపిస్తే పార్లమెంటులో నోరు కూడా మెదపరని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నల్గొండ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న తనను గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ కు కేంద్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సహకరిస్తోందని ఆరోపించారు.

ఈ లోక్ సభ ఎన్నికల్లో తనను గెలిపిస్తే నల్గొండను స్మార్ట్ సిటీగా మారుస్తానని హామీ ఇచ్చారు. నల్గొండలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. తెలంగాణ సీఎం చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ పై ఉత్తమ్ విమర్శలు గుప్పించారు. అసలు ఫెడరల్ ఫ్రంట్ తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరో కేసీఆర్ ముందుగా చెప్పాలని డిమాండ్ చేశారు.

Telangana
Congress
Lok Sabha
Nalgonda
TRS
KCR
federal front
  • Loading...

More Telugu News