Telangana: కేసీఆర్ తన స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారు.. వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలి!: బండారు దత్తాత్రేయ

  • కేంద్రం తెలంగాణకు రూ.30 వేల కోట్లు గ్రాంట్ ఇచ్చింది
  • దీనిపై ఏ చౌరస్తాలో అయినా చర్చకు సిద్ధం
  • బీజేపీ 300 సీట్లు గెలిస్తే కేసీఆర్, కేటీఆర్ రాజకీయ సన్యాసం చేస్తారా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్థాయిని మరిచి ప్రధాని మోదీ గురించి మాట్లాడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ  విషయంలో కేసీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి తెలంగాణకు రూ.30,000 కోట్లు గ్రాంటుగా అందించామని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో దత్తాత్రేయ మాట్లాడారు.

కేసీఆర్ ను ప్రధాని అభ్యర్థిగా ఎవ్వరూ గుర్తించరని దత్తాత్రేయ స్పష్టం చేశారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులపై ఏ చౌరస్తాలో అయినా చర్చించేందుకు సిద్ధమని తేల్చిచెప్పారు. కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ ఓ అతుకుల బొంత అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తెలంగాణలో రోజురోజుకూ బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందన్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 300 సీట్లు గెలిస్తే సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News