Andhra Pradesh: మరో 40 ఏళ్ల పాటు మంగళగిరికి లోకేశే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తారు!: బుద్ధా వెంకన్న జోస్యం
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-e23d817c355ddffee7eed385eadfe878938739cb.jpg)
- రాజులాంటి చంద్రబాబు కడుపున యువరాజు లోకేశ్ పుట్టాడు
- మంగళగిరిలో వైసీపీ పెయిడ్ ఆర్టిస్టుల ఆటలు సాగవు
- విజయవాడలో మీడియాతో టీడీపీ నేత
దొంగ కడుపున దొంగే పుడతాడనీ, వైఎస్ రాజశేఖరరెడ్డి కడుపున జగన్ పుట్టాడని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. నిజాయతీపరుడైన రాజు లాంటి చంద్రబాబు కడుపున యువరాజు లోకేశ్ పుట్టాడని వ్యాఖ్యానించారు. మంగళగిరిలో జగన్ పంపించే పెయిడ్ ఆర్టిస్టుల ఆటలు ఇకపై సాగవని స్పష్టం చేశారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో బుద్ధా వెంకన్న మాట్లాడారు.
కుప్పం తర్వాత బీసీలు మంగళగిరిలోనే ఎక్కువగా ఉన్నారని బుద్ధా వెంకన్న తెలిపారు. మంగళగిరిలోని బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే లోకేశ్ పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో లోకేశ్ ఘనవిజయం సాధిస్తారని జోస్యం చెప్పారు. అంతేకాకుండా రాబోయే 40 ఏళ్ల పాటు మంగళగిరికి లోకేశే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తారని స్పష్టం చేశారు. మే 23న ఫలితాల అనంతరం జగన్ గుండెలు బాదుకోవడం ఖాయమని వ్యాఖ్యానించారు.