jagan: జగన్, విజయమ్మ, షర్మిల పందికొక్కుల్లా రాష్ట్రంపై పడ్డారు: సాధినేని యామిని

  • ఎక్కడ చూసినా జగన్ అవినీతే కనిపిస్తోంది
  • మహిళల నుదిటిబొట్టు తుడిచేసిన వారికి.. పసుపు-కుంకుమ విలువ ఏం తెలుస్తుంది
  • జగన్, మోదీ, కేసీఆర్ లు ఫ్యాన్ కు మూడు రెక్కలు

వైసీపీ అధినేత జగన్, ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలపై టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరు ముగ్గురు పందికొక్కుల్లా రాష్ట్రంపై పడ్డారని వ్యాఖ్యానించారు. ఎక్కడ చూసినా జగన్ అవినీతి చరిత్రే కనిపిస్తోందని విమర్శించారు. విజయమ్మ, షర్మిల రాష్ట్రంలో పర్యటించి ఉంటే టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కనిపించేదని అన్నారు. సీమ నీళ్లు తాగి ఉంటే ప్రాజెక్టులపై వీరు మాట్లాడేవారు కాదని చెప్పారు. ఫ్యాన్ లో ఉండే మూడు రెక్కలు జగన్, మోదీ, కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. సొంత జిల్లాలోని కడప స్టీల్ ప్లాంట్ పై మోదీని జగన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. మహిళల నుదిటిబొట్టును తుడిచేసిన వైయస్ కుటుంబానికి... తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తున్న పసుపు-కుంకుమ విలువ ఏం తెలుస్తుందని అన్నారు.

jagan
vijayamma
sharmila
sadhineni yamini
Telugudesam
ysrcp
kcr
TRS
modi
bjp
  • Loading...

More Telugu News