Kanna Lakshminarayana: నీ స్థాయి మరింతగా దిగజారిపోయింది చంద్రబాబూ: కన్నా విసుర్లు

  • దేశాన్ని ముక్కలు చేయాలని చూసే ఫారూఖ్ అబ్ధుల్లా
  • అబద్ధాల కేజ్రీవాల్, హత్యలు చేయించే మమతా
  • వీరితోనా నీ పొత్తులు? అంటున్న కన్నా 

ఇండియాను ముక్కలు చేయాలని చూసే వేర్పాటు వాద నేత ఫారూఖ్ అబ్దుల్లాతో పొత్తు పెట్టుకుని, ఆయన్ను ప్రచారానికి తేవడం ద్వారా చంద్రబాబు స్థాయి మరింతగా దిగజారిపోయిందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. అబద్ధాలు చెప్పే కేజ్రీవాల్, రాజకీయ హత్యలు చేయించే మమతా బెనర్జీతో ప్రచారం చేయించడం ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "వినాశ కాలే విపరీత బుద్ధి. అధికారం కోసం వేర్పాటువాద, అరాచక నాయకులతో చేతులు కలుపుతావా చంద్రబాబు? వేర్పాటువాద ఫారూఖ్ అబ్దుల్లా, అబద్ధాల ఆరవింద్ కేజ్రివాల్, అరాచక రాజకీయ హత్యలతో మమతా... వీరితోనా నీ ప్రచారం..? వీరితో రాజకీయ పొత్తులు పెట్టుకుని నీ స్థాయి మరింత దిగజారిపోయింది" అని అన్నారు.



Kanna Lakshminarayana
Twitter
Chandrababu
  • Loading...

More Telugu News