Andhra Pradesh: టీడీపీలో కుమ్ములాట.. మీడియా సమావేశంలో కన్నీరు పెట్టుకున్న పీతల సుజాత

  • నిన్నటి సభలో అంబికాకృష్ణ విమర్శలు
  • ఆయన వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి
  • కన్నీటిపర్యంతమైన సుజాతను ఓదార్చిన టీడీపీ నేతలు

తన మంత్రి పదవి పోయినా స్పోర్టివ్ గా తీసుకుని పనిచేశానని టీడీపీ నేత పీతల సుజాత తెలిపారు. పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి టికెట్ ఇవ్వకపోయినా బాధపడలేదన్నారు. ‘పీతల సుజాతకు పొగరు, అహంభావం, చేతకానితనం’ అని టీడీపీ నేత అంబికాకృష్ణ నిన్న జరిగిన ఓ సభలో తనను విమర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో పీతల సుజాత మాట్లాడారు.

తాను వైసీపీలో చేరుతున్నట్లు అంబికా కృష్ణ భావించారన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఆయన వేషాలు అందరికీ తెలుసన్నారు. ఈ సందర్భంగా అంబికాకృష్ణ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సుజాత కన్నీరు పెట్టుకున్నారు. దీంతో టీడీపీ నేతలు, మద్దతుదారులు ఆమెను సముదాయించారు. ఈసారి చింతలపూడి టికెట్ ను సుజాతకు కాకుండా డా.కర్ర రాజారావుకు చంద్రబాబు కేటాయించారు.

Andhra Pradesh
Telugudesam
West Godavari District
PEETALA SUJATA
CRY
ambika krishna
  • Loading...

More Telugu News