Kamal Haasan: తమిళనాట సంచలనం.. కమలహాసన్ పార్టీకి రజనీకాంత్ మద్దతు

  • రజనీకాంత్ మద్దతు తెలిపారన్న కమల్
  • ఎన్నికల్లో విజయం సాధించాలని రజనీ ఆకాంక్షించారు
  • బీజేపీకి మా పార్టీ బీ-టీమ్ కాదు

తమిళనాడు రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. కమలహాసన్ పార్టీకి రజనీకాంత్ మద్దతు ప్రకటించారు. ఈ విషయాన్ని కమలహాసన్ స్వయంగా వెల్లడించారు. గతంలో తన పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ సందర్భంగా రజనీ మద్దతును తాను కోరానని... ఆయన సరేనన్నారని చెప్పారు. ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించాలని రజనీ ఆకాంక్షించారని... రేపటి రోజు మనదేనని చెప్పారని తెలిపారు. బీజేపీకి తమ పార్టీ బీ-టీమ్ కాదని చెప్పారు. 39 లోక్ సభ స్థానాలతో పాటు... ఉపఎన్నికలు జరుగుతున్న 18 అసెంబ్లీ స్థానాల్లో కమల్ పార్టీ మక్కల్ నీధి మయ్యమ్ పోటీ చేస్తోంది. అయితే, కమల్ మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు.

Kamal Haasan
Rajinikanth
support
  • Loading...

More Telugu News