Daadi veerabhadrarao: మే 23న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం: దాడి వీరభద్రరావు

  • చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది జగనే
  • జాతీయ మీడియా సర్వేలన్నీ జగన్ వైపే
  • పాలక్యాన్లలో టీడీపీ డబ్బు తరలిస్తోందన్న దాడి

వచ్చే నెల 23వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దాడి వీరభద్రరావు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా, జగన్ గెలవకుండా ఆపలేరని అన్నారు. తాజాగా, విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన, పాల క్యాన్లలో డబ్బును తరలిస్తున్నారని ఆరోపించారు. ఈసీ అధికారులు దీనిపై దృష్టిని సారించాలని కోరారు.

సమస్యల పరిష్కారం కోసం అధికారంలో ఉన్న వారిని కాకుండా, ప్రతిపక్షంలో ఉన్న వారిని విమర్శించడంతోనే పవన్ కల్యాణ్ తెలివితేటలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేసిన దాడి, ఏపీ ప్రజలు వైసీపీకి అధికారాన్ని అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అనకాపల్లిలో గెలుపు కోసం రూ. 100 కోట్లు ఖర్చు చేస్తారన్న ఉద్దేశంతోనే విశాఖ డైరీ చైర్మన్ కుమారుడిని బరిలో నిలిపారని ఆరోపించారు. ఎన్నో జాతీయ మీడియాల సర్వేలు జగన్ కు అనుకూలంగా సర్వేలు ఇస్తుంటే, ఎల్లో మీడియా పత్రికలు మాత్రం తప్పుడు సర్వేలను ప్రచారం చేస్తున్నాయని అన్నారు.

Daadi veerabhadrarao
Chandrababu
Jagan
cm
  • Loading...

More Telugu News