Andhra Pradesh: అన్నపూర్ణలాంటి ఏపీని ఎడారిగా మారుస్తారా?: జగన్ పై టీడీపీ నేత కళా వెంకట్రావు ధ్వజం

  • కేసీఆర్ తో కలిసి జగన్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారు
  • ప్రజలు, రైతులు ఏమైపోయినా ఫరవాలేదనుకుంటున్నారు
  • వైసీపీ అధినేతకు బహిరంగ లేఖ రాసిన టీడీపీ నేత

నవ్యాంధ్ర విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిసి వైసీపీ అధినేత జగన్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ను ఎడారిగా మార్చేందుకు యత్నించడం జగన్ దిగజారుడుతనానికి నిదర్శమని దుయ్యబట్టారు.

ఏపీ ప్రజలు, రైతులు ఏమైపోయినా ఫరవాలేదు అన్నరీతిలో జగన్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత తీరును విమర్శిస్తూ కళా వెంకట్రావు ఆయనకు బహిరంగ లేఖ రాశారు.

పోలవరం ముంపు మండలాల విషయంలో కుట్ర జరుగుతోందని కళా వెంకట్రావు ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకుంటూ కేసుల నుంచి మాఫీ పొందేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పక్క రాష్ట్రంలో అక్రమంగా కడుతున్న సాగునీటి ప్రాజెక్టులపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఏపీలో టీడీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Andhra Pradesh
Telugudesam
YSRCP
kala venkatrao
Jagan
open letter
  • Loading...

More Telugu News