Chittoor District: చంద్రబాబు మెజార్టీ లక్ష దాటాలి : కుప్పం కార్యకర్తలకు భువనేశ్వరి పిలుపు

  • పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్‌
  • బాబు విజయం కోసం ఐక్యంగా పనిచేయాలని సూచన
  • అతి విశ్వాసం వద్దని హెచ్చరిక

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఎన్నికల్లో ఆయన మెజార్టీ లక్ష ఓట్లను దాటాలని, ఇందుకోసం పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని సీఎం భార్య నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంతో చంద్రబాబు బిజీగా ఉండడంతో ఆయన సొంత నియోజకవర్గం ప్రచార బాధ్యతలను భువనేశ్వరి చేపట్టారు. ఇందులో భాగంగా నిన్న ఆమె పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో దాదాపు 2 వేల మంది నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గెలిచేస్తామన్న అతివిశ్వాసానికి ఎవరూ పోవద్దని, జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు.

Chittoor District
kuppam
nara bhuvaneswari
Chandrababu
  • Loading...

More Telugu News