Hindupuram: బాలకృష్ణ ప్రచారానికి వెళ్లిన సహ నిర్మాతకు గాయాలు!

  • హిందూపురంలో బాలయ్య ప్రచారం
  • కలిసేందుకు వెళ్లిన కొమ్మినేని వెంకటేశ్వరరావు
  • వాహనం ఎక్కుతుండగా ప్రమాదం

హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగిన నందమూరి బాలకృష్ణతో కలిసి ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన టాలీవుడ్ సహ నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వరరావు గాయపడ్డారు. నియోజకవర్గ పరిధిలోని చిలమత్తూరు మండలం మడంపల్లి వద్ద బాలయ్య ప్రచారం చేస్తుండగా, ఆయన్ను కలిసేందుకు వెంకటేశ్వరరావు వెళ్లారు. బాలకృష్ణ నిలబడివున్న ప్రచార రథం ఎక్కేందుకు ఆయన ప్రయత్నించిన వేళ, వాహనం ముందుకు కదిలింది. దీంతో ఆయన ఎడమ చేతికి తీవ్రగాయం అయింది. వెంటనే హిందూపురంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి ఆయనను తరలించగా, శస్త్రచికిత్స చేయాల్సివుందని డాక్టర్లు తేల్చారు.  

Hindupuram
Balakrishna
Accident
Kommineni Venkateshwarlu
  • Loading...

More Telugu News