Chandrababu: నేను ఓడిపోతే భార్య, కొడుకు, మనవడితో గడుపుతా.. మరి మోదీ ఓడిపోతే ఎవరితో గడుపుతారు?: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

  • మోదీకి కుటుంబ వ్యవస్థ తెలియదు
  • ప్రజలకు సేవ చేయాలన్నదే అభిమతం
  • సినీ నటుల్లో కనీస మానవత్వం లేకుండా పోయింది
  • మదనపల్లిలో చంద్రబాబునాయుడు

ఈ ఎన్నికల్లో తాను ఓడిపోతే భార్య, కుమారుడు, మనవడితో గడుపుతానని, మరి నరేంద్ర మోదీ ఓడిపోతే ఎవరితో కాలం గడుపుతారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. నిన్న రాత్రి చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, కుటుంబ వ్యవస్థంటే ఏంటో మోదీకి తెలియదని ఆరోపించారు.

తన చేతికి బంగారపు ఉంగరాలు, మెడలో గొలుసులు లేవని, అటువంటి వాటిపై తనకు ఆశ కూడా లేదని, కేవలం ప్రజలకు సేవ చేయాలన్నది మాత్రమే తన అభిమతమని చంద్రబాబు స్పష్టం చేశారు. తాను శాకాహారం మాత్రమే తింటానని, అది కూడా తక్కువేనని అన్నారు. జగన్ పార్టీలో పనిచేయడానికి వచ్చిన సినీ కళాకారులు అలీ, జయసుధ వంటివారు, తిత్లీ, హుద్‌ హుద్‌ తుపాన్లు వచ్చిన సమయంలో ఎక్కడున్నారని ప్రశ్నించారు. వీరి సినిమా టికెట్లు కొన్న ప్రజలు, వీరిని కోటీశ్వరులను చేశారని, వీరిలో మాత్రం కనీస మానవత్వం లేకుండా పోయిందని అన్నారు.

Chandrababu
Madanapalli
Narendra Modi
  • Loading...

More Telugu News