nellore: వైసీపీ అభ్యర్థులతో టీడీపీ అభ్యర్థులకు పోలికా?: నెల్లూరులో సీఎం చంద్రబాబు

  • రోజుకో పార్టీ మారే వాళ్లూ నాయకులేనా?
  • ఇలాంటి నాయకులను మనం గెలిపించాలా?
  • జగన్ కరుడుగట్టిన నేరస్తుడు

పనికిరాని వైసీపీ అభ్యర్థులతో టీడీపీ అభ్యర్థులకు పోలికా? అని సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. నెల్లూరులో నిర్వహించిన రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ, రోజుకో పార్టీ మారుతున్న వాళ్లు కూడా నాయకులేనా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలపై విమర్శలు గుప్పించారు. ఇలాంటి నాయకులను మనం గెలిపించాలా? అని ప్రశ్నించారు.

అభివృద్ధి కోసం పాటుపడుతున్న టీడీపీకి ఓటు వేస్తారా? లేక ఇలాంటి వారికి ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు. ఇక్కడి వైసీపీ ఎమ్మెల్యే ఎగిరెగిరి పడుతున్నాడని, ‘చంపడమో, చంపించుకోవడమో’ అని ఆయన అంటున్నాడని మండిపడ్డారు. ‘చంపం, చంపించుకోనియ్యం. నిన్ను బోనెక్కిస్తాం. తప్పుడు పనులు చేస్తే జైలుకుపోతావు’ అని హెచ్చరించారు. ఈ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి శిష్యుడని, జగన్ కరుడుగట్టిన నేరస్తుడైతే, వీళ్లంతా ఆయన్ని అనుసరించే వాళ్లు అని చంద్రబాబు విమర్శించారు.

nellore
Telugudesam
Chandrababu
YSRCP
anil
jagan
narayana
anam
aadala
prabhaker reddy
  • Loading...

More Telugu News