Andhra Pradesh: సుజనా గ్రూప్ నకు ఈడీ షాక్.. రూ.315 కోట్ల ఆస్తుల జప్తు!

  • నకిలీ ఆస్తులు, బోగస్ ఇన్వాయిస్ లతో రుణాలు 
  • షెల్ కంపెనీల పేరిట బ్యాంకులకు కుచ్చు టోపి
  • సుజనా ఆఫీస్ నుంచి డాక్యుమెంట్లు స్వాధీనం

ఏపీ టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి చెందిన సుజనా గ్రూప్ నకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. షెల్ కంపెనీల పేరిట బ్యాంకులను మోసగించిన కేసులో రూ.315 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసినట్టు సమాచారం. భారీ ఎత్తున షెల్ కంపెనీలను సుజనా చౌదరి సృష్టించినట్టు ఈడీ గుర్తించినట్టు సమాచారం.

నకిలీ ఆస్తులు, బోగస్ ఇన్వాయిస్ లతో బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకుని, ఆ మొత్తాన్ని షెల్ కంపెనీలకు తరలించినట్టు తెలుస్తోంది. మహాల్ హోటల్ అనే షెల్ కంపెనీని సృష్టించి దాని ద్వారా వైశ్రాయ్ హోటల్ లిమిటెడ్ కు నిధులు తరలించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్, పంజాగుట్టలోని నాగార్జున హిల్స్ లోని సుజనా ఆఫీస్ నుంచి డాక్యుమెంట్లు, షెల్ కంపెనీలకు చెందిన 124 నకిలీ రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News