Roja: ఓటమి ఖాయమని తెలిసి రోజా డిప్రెషన్‌లో నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది: దివ్యవాణి

  • లక్ష్మీపార్వతికి ఆశ ఇంకా చావలేదు
  • అన్యాయాలకు, అక్రమాలకు ప్రతీక వైసీపీ
  • యువతను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు

వైసీపీ నాయకులు యువతను నేరగాళ్లుగా తయారు చేయాలనుకుంటున్నారా? అంటూ టీడీపీ నాయకురాలు దివ్యవాణి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ నేత అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు యువతను రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. అన్యాయాలకు, అక్రమాలకు ప్రతీకే వైసీపీ అని దివ్యవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నగరిలో తాను ఓడిపోవడం ఖాయమని గ్రహించిన రోజా డిప్రెషన్‌లోకి వెళ్లి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పసుపు-కుంకుమ సొమ్మును బ్యాంకుల్లో వేయనీయకుండా వైసీపీ నాయకులు కోర్టులో పిటిషన్ వేశారని దివ్యవాణి ఆరోపించారు. లక్ష్మీ పార్వతికి రాజకీయాలను ఏలాలనే ఆశ ఇంకా చావలేదని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీడీపీ గెలుపు తథ్యం అని తెలుసుకున్న వైసీపీ నేతలు భరించలేకపోతున్నారని దివ్యవాణి పేర్కొన్నారు.

Roja
Nagari
Telugudesam
Divya Vani
YSRCP
Anil Kumar
  • Loading...

More Telugu News