Krishna District: అందుకే, చంద్రబాబు తన రెండేళ్లు చూపిస్తుంటారు: వైఎస్ షర్మిళ సెటైర్లు

  • బాబు తన రెండు వేళ్లు చూపిస్తుంటే ఏదో అనుకున్నాం
  • రెండు నాల్కల ధోరణి అని ఇప్పుడు అర్థమైంది
  • ఏపీకి ‘ప్రత్యేకహోదా’ను నీరు గార్చింది చంద్రబాబే

రోజుకో మాట, పూటకో వేషం చంద్రబాబుది అని, అందుకే, తనరెండు వేళ్లను చూపిస్తూ ఉంటారని వైసీపీ నాయకురాలు షర్మిళ విమర్శించారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు తన రెండు వేళ్లు చూపిస్తుంటే, ఏదో అనుకున్నాం కానీ, ఇప్పుడు అర్థమైందని, ఆయనది రెండు నాల్కల ధోరణి అని విమర్శించారు.

ఏపీకి ‘ప్రత్యేకహోదా’ ను నీరు గార్చింది చంద్రబాబే అని, ఆ ‘హోదా’ సాధన కోసం నిరంతరం పోరాడుతోందని జగన్ అని అన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే చాలన్న చంద్రబాబు, మళ్లీ ప్రత్యేక హోదా కావాలని ఆయన అడగడానికి కారణం జగనే అని, ‘దమ్ముంటే, చంద్రబాబు నిజం చెప్పాలని, కానీ, ఆయనకు దమ్ము లేదు’ అని అన్నారు. 

Krishna District
gudivada
YSRCP
sharmila
  • Loading...

More Telugu News