Varla Ramaiah: జగన్ అవినీతి గురించి విశ్వవిద్యాలయాల్లో చర్చించుకుంటున్నారు: వర్ల రామయ్య

  • అక్రమాస్తులను కూడబెట్టుకోవడానికే ఒక్క ఛాన్స్
  • ఇదేమైనా సినిమా ఛాన్సా?
  • జగన్‌పై దయ చూపించొద్దు

అక్రమాస్తులను కూడబెట్టుకోవడానికే వైసీపీ అధినేత జగన్ ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ ఒక్క ఛాన్స్ కోరుతున్నారని, అడగగానే ఇచ్చేయడానికి ఇదేమైనా సినిమా ఛాన్సా? అని ఎద్దేవా చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్లు దోచుకున్నందుకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలా? అని నిలదీశారు.

రూ.10 ఉన్న జగన్ కంపెనీ షేర్లు ఒక్కసారిగా రూ.1450కి ఎలా పెరిగాయని ప్రశ్నించారు. అవినీతిపరుడైన జగన్‌పై దయ చూపించొద్దని ప్రజలకు సూచించారు. జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వడమంటే మన నెత్తిన మనమే భస్మాసుర హస్తాన్ని పెట్టుకున్నట్టేనని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. విశ్వవిద్యాలయాల్లో జగన్ అవినీతి గురించి చర్చించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Varla Ramaiah
Jagan
University
Shares
Telugudesam
  • Loading...

More Telugu News