Nizamabad: పోలింగ్‌ని వాయిదా వేయండి.. కలెక్టర్ ను కోరిన నిజామాబాద్ రైతు అభ్యర్థులు

  • ఎన్నికలపై కనీస అవగాహన లేదు
  • 15 రోజుల పాటు వాయిదా వేయాలి
  • బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలి

నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్‌ను వాయిదా వేయాలంటూ ఆ స్థానం నుంచి బరిలో ఉన్న రైతు అభ్యర్థులు కలెక్టర్ ఆమ్రపాలిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, తాము రైతులం కనుక వ్యవసాయంపై తప్ప ఎన్నికలపై కనీస అవగాహన లేదని, సరైన అవగాహన కల్పించాలని ఈసీని కోరారు.

పోలింగ్‌ను 10 నుంచి 15 రోజుల పాటు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఇందూరులో ఎన్నికలు నిర్వహించాలని కోరామని, అలాగైతేనే తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. అలాగే తమకు కేటాయించిన గుర్తులను ఇప్పటి వరకూ ఇమేజ్ రూపంలో ఇవ్వలేదని తెలిపారు. ఎన్నికల నియమావళిపై తమకున్న సందేహాలను నివృత్తి చేయాలని కోరారు.

Nizamabad
Formers
Amrapali
Polling
Ballet
Induru
  • Loading...

More Telugu News