Krishna District: గుడివాడలో ఎవరు అడుగుపెట్టినా ఎగిరేది వైసీపీ జెండాయే: వైసీపీ నేత బాలశౌరి

  • పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లే ధైర్యం బాబుకు లేదు
  • ఇంతవరకూ కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మించలేదు 
  • అమరావతిని సింగపూర్ చేస్తారట

గుడివాడలో ఎవరు అడుగుపెట్టినా ఎగిరేది వైసీపీ జెండాయే అని వైసీపీ నేత బాలశౌరి ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, మొన్నటి వరకు బీజేపీ, నేడు కాంగ్రెస్ తో చంద్రబాబు చేతులు కలిపారని విమర్శించారు. పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదని అన్నారు. 'విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మించలేదు కానీ, అమరావతిని సింగపూర్ చేస్తారట' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  

Krishna District
Gudivada
YSRCP
Balashouri
  • Loading...

More Telugu News