Kodali Nani: కొడాలి నానిపై నిప్పులు చెరిగిన బుద్ధా వెంకన్న

  • నీతిమంతుడైన అవినాశ్ కు, క్రిమినల్ కొడాలి నానికి మధ్య పోటీ జరుగుతోంది
  • గెలవడం కోసం కొడాలి నాని ఎన్ని అబద్ధాలైనా చెబుతారు
  • గుడివాడ అభివృద్ధి నిరోధకశక్తిగా మారారు

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. గుడివాడలో నీతిమంతుడైన దేవినేని అవినాశ్ కు, క్రిమినల్ అయిన కొడాలి నానికి మధ్య పోటీ జరుగుతోందని అన్నారు. ఈ విషయాన్ని ఓటర్లు గ్రహించి, అవినాశ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గెలవడం కోసం కొడాలి నాని ఎన్ని అబద్ధాలైనా చెబుతారని విమర్శించారు. గుడివాడలో భల్లాలదేవుడు నాని అయితే, బాహుబలి అవినాశ్ అని చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబును ఏకవచనంతో సంబోధించేంత స్థాయి కొడాలి నానికి లేదని బుద్ధా వెంకన్న అన్నారు. డబ్బు రాజకీయాలకు గుడివాడ నియోజకవర్గ ప్రజలు ప్రభావితంకారని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే గుడివాడను మరో కుప్పం చేస్తామని తెలిపారు. గుడివాడ అభివృద్ధి నిరోధకశక్తిగా నాని మారారని ఆరోపించారు. ఓటమి భయంతోనే అవినాశ్ పై నాని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు గురించి మరోసారి నోరు జారితే... తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

Kodali Nani
devineni avinash
budda venkanna
Telugudesam
ysrcp
gudivada
  • Loading...

More Telugu News