ajay: హీరోగా అజయ్ .. ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'స్పెషల్' మూవీ ట్రైలర్

  • అజయ్ హీరోగా రూపొందిన 'స్పెషల్'
  • పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న అజయ్
  •  త్వరలో ప్రేక్షకుల ముందుకు    

విలన్ గా విభిన్నమైన నటనతో అజయ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. కథలో కీలకంగా నిలిచే పాత్రలను కూడా చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. గతంలో ఒకటి రెండు సినిమాల్లో హీరోగాను కనిపించిన ఆయన, మరో మారు 'స్పెషల్' సినిమాతో హీరోగానే ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. వాత్సవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అజయ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు.

 '93 డేస్ సస్పెన్షన్ తరువాత తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యాను. గత 7 రోజుల్లో నేను చూసిన విషయాలు ఏ పోలీస్ ఆఫీసర్ తన కెరియర్లో చూసుండడు" అంటూ అజయ్ చెప్పిన డైలాగ్ ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక కేసు విచారణకి సంబంధించిన నేపథ్యంలో ఈ కథ సాగుతుందనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోగా ఈ సారి అజయ్ ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి

ajay
  • Error fetching data: Network response was not ok

More Telugu News