Akbaruddin Owaisi: మీ భార్య సంగతేంటి?: ప్రధానిపై అక్బరుద్దీన్ ఒవైసీ వ్యక్తిగత విమర్శలు

  • తలాక్ బాధితులకు అండగా ఉంటామన్న మోదీ
  • తన భార్యకు ఏ హక్కులు కల్పించారో చెప్పాలి
  • టీ చేయడం తప్ప మరేమీ తెలియని చౌకీదార్
  • హైదరాబాద్ లో అక్బరుద్దీన్ ఒవైసీ

ట్రిపుల్‌ తలాక్‌ కారణంగా ఇబ్బందులు పడే ముస్లిం మహిళలకు అండగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. ఇతర మహిళల గురించి తరువాత మాట్లడొచ్చని, ముందు తన భార్య సంగతి ఏంటో మోదీ చెప్పాలని ప్రశ్నించారు. మోదీ తన భార్యకు ఏ హక్కులు కల్పించారో తొలుత చెప్పాలని అక్బరుద్దీన్ డిమాండ్‌ చేశారు. ముస్లిం సోదరీమణులు, కూతుళ్ల విడాకుల గురించి ఆయన నిజంగా చాలా బాధపడుతున్నట్టుందని సెటైర్ వేసిన అక్బరుద్దీన్, అసలు ఒక్క హక్కునైనా జశోదాబెన్ కు కల్పించారా? అంటూ వ్యక్తిగత విమర్శలకు దిగారు.

నిన్నటి తెలంగాణ పర్యటనలో భాగంగా ఎల్బీ స్టేడియంలో మోదీ ప్రసంగిస్తూ, హైదరాబాద్ డెవలప్ మెంట్ కు మజ్లిస్ అడ్డుగా నిలుస్తోందని విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను ప్రస్తావించిన అక్బరుద్దీన్, మజ్లిస్ గురించి మాట్లాడుతున్న చాయ్‌ వాలాలు, చౌకీదార్లకు తమ పార్టీ గురించి ఏం తెలుసునని ప్రశ్నించారు. వారికి టీ చేయడం తప్ప ఇంకో విషయం తెలియదని ఎద్దేవా చేశారు. 'మిషన్‌ శక్తి' విజయవంతం కావడానికి డీఆర్డీఓ కారణమని, అది మన నగరంలోనే ఉందన్న విషయాన్ని మోదీ మరచిపోయారని విమర్శించారు.

  • Loading...

More Telugu News