gvl: కియా పరిశ్రమ రావడంలో చంద్రబాబు పాత్ర ఎంతో కొంత ఉంది: జీవీఎల్

  • జనసేన పేరును కులసేనగా మార్చుకోవాలి
  • కాపు ఓట్లు ఎక్కువ ఉన్న చోటే పవన్ పోటీ చేస్తున్నారు
  • పోలవరం చంద్రబాబుకు సొమ్మువరం

జనసేన పార్టీ పేరును కులసేనగా మార్చుకోవాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కాపు ఓట్లు ఎక్కువ ఉన్న చోటే ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. భారత్ కు కియా పరిశ్రమ రావడంలో ప్రధాని మోదీ పాత్ర ఉందని.. ఆ పరిశ్రమ ఏపీకి రావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర ఎంతో కొంత ఉందని చెప్పారు. టీడీపీ హయాంలో అవినీతి ఆకాశాన్నంటిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు సొమ్మువరం అని విమర్శించారు. వైసీపీ అధినేత జగన్ మీకు మిత్రుడా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించడం పట్ట ఆయన అసహనం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

gvl
narasimha rao
Chandrababu
Pawan Kalyan
jagan
Telugudesam
bjp
ysrcp
janasena
  • Loading...

More Telugu News