lakshmi parvathi: రూ. 60 కోట్లు ఖర్చు పెట్టి సర్టిఫికెట్ కొనిచ్చాడు వాళ్ల నాన్న.. దాన్ని చదవడం కూడా లోకేష్ కు రాదు: లక్ష్మీపార్వతి

  • లోకేష్ కు ఒకటో క్లాసు పరిజ్ఞానం కూడా లేదు
  • ఇప్పుడు సీఎంను చేయాలనుకుంటున్నారు
  • చంద్రబాబు ప్రలోభాలను నమ్మకండి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లపై వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో రూ. 60 కోట్లు ఖర్చు పెట్టి లోకేష్ కు వాళ్ల నాన్న సర్టిఫికెట్ కొనిచ్చారని... ఆ సర్టిఫికెట్ ను చదవడం కూడా లోకేష్ కు రాదని ఎద్దేవా చేశారు. ఒకటో క్లాసు పరిజ్ఞానం కూడా లేని మీ కొడుక్కి ఏకంగా మూడు శాఖలకు మంత్రిని ఎలా చేశారంటూ చంద్రబాబును నిలదీశారు. ఇప్పుడు లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారని... ఇంత దుర్మార్గులకు ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. లోకేష్ నాయకత్వం కావాలా? లేక జగన్ నాయకత్వం కావాలా? ఆలోచించుకోవాలని అన్నారు. చంద్రబాబు ప్రలోభాలను నమ్మకూడదని ఓటర్లకు విన్నవించారు.

lakshmi parvathi
Chandrababu
nara lokesh
Telugudesam
ysrcp
jagan
  • Loading...

More Telugu News