ntr: ఎన్టీఆర్ కు వెన్నుపోటు కాదు.. వెన్నుపోటు పొడిపించుకుంది చంద్రబాబే: డాక్టర్ కుసుమ రావు

  • ఎన్టీఆర్ కు ఎంతో ఛరిష్మా ఉండేది
  • అయితే, అడ్మినిస్ట్రేషన్ మొత్తం చంద్రబాబే చూసుకునేవారు
  • ఉదయం 5 గంటలకల్లా రాకపోతే ఎన్టీఆర్ నుంచి బాబుకు కబురు వచ్చేది

దివంగత ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనడం సరికాదని బసవతారకం స్నేహితురాలు డాక్టర్ కుసుమ రావు అన్నారు. నిజంగా వెన్నుపోటు పొడిపించుకున్నది చంద్రబాబేనని చెప్పారు. అప్పట్లో టీడీపీకి ఛరిష్మా మొత్తం ఎన్టీఆరేనని... కాకపోతే అడ్మినిస్ట్రేషన్ మొత్తం చంద్రబాబే చూసుకునేవారని తెలిపారు. తెల్లవారుజామున 5 గంటలకల్లా రాకపోతే ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకు కబురు వచ్చేదని చెప్పారు. ప్రభుత్వ పరంగా ఎన్నో గందరగోళాలను సమర్థవంతంగా పరిష్కరించింది చంద్రబాబేనని అన్నారు. ప్రతి కార్యకర్త పేరు చంద్రబాబుకు తెలుసని చెప్పారు.

ఎన్టీఆర్ కు ఏ ఆలోచన వస్తే అది జరిగిపోవాల్సిందేనని... అయితే, ఎలాంటి సమస్యలు వచ్చినా, దాన్నంతా సరిదిద్దే బాధ్యత చంద్రబాబే చూసుకునేవారని కుసుమ తెలిపారు. సమస్యలను ఎన్టీఆర్ పిల్లలు కానీ, మరో అల్లుడు కానీ సరిదిద్దే పరిస్థితి లేదని చెప్పారు. ఏ టు జెడ్ చంద్రబాబే చూసుకోవాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. అలాంటి చంద్రబాబును లక్ష్మీపార్వతి సూచన మేరకు అన్ని పదవులకు ఎన్టీఆర్ దూరం పెట్టారని... నిజంగా చెప్పాలంటే వెన్నుపోటుకు గురైంది చంద్రబాబేనని చెప్పారు.

ntr
lakshmi parvathi
Chandrababu
kusuma rao
Telugudesam
  • Error fetching data: Network response was not ok

More Telugu News