sai tej: 'చిత్రలహరి' నుంచి యూత్ హృదయాలను దోచుకునే పాట

  • కిషోర్ తిరుమల నుంచి మరో ప్రేమకథ 
  • తేజు జోడీగా కల్యాణి ప్రియదర్శన్ 
  • ఏప్రిల్ 12వ తేదీన భారీ విడుదల  

సాయితేజ్ .. కల్యాణి ప్రియదర్శన్ జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' సినిమా రూపొందింది. అందమైన ప్రేమకథగా నిర్మితమైన ఈ సినిమాను వచ్చేనెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మూడవ లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. "రంగురంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా .. ఏడురంగులొక్కటై పరవశించే వేళలో నేలకే జారిన కొత్త రంగులా .. ప్రేమ వెన్నెలా .. రావే ఊర్మిళా .. " అంటూ ఈ పాట సాగుతోంది.

ప్రకృతి తనకి ప్రసాదించిన కొత్త అందమే ఈ ప్రియురాలు అనే భావానికి అక్షర రూపమిచ్చి కథానాయకుడు పాడుకునే పాట ఇది. సాయితేజ్ .. కల్యాణి ప్రియదర్శన్ పై చిత్రీకరించిన ఈ పాట యూత్ కి కనెక్ట్ అయ్యేలా వుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం .. శ్రీమణి సాహిత్యం .. సుదర్శన్ అశోక్ ఆలాపన యూత్ మనసులను పట్టేసేలా వున్నాయి. తేలికైన పదాలతో శ్రీమణి అందమైన .. అర్థవంతమైన సాహిత్యాన్ని అందించాడు. ఈ సినిమాతో తేజు హిట్ కొడతాడేమో చూడాలి.

sai tej
kalyani priyadarshan
  • Error fetching data: Network response was not ok

More Telugu News