ntr: ఎన్టీఆర్ ది సహజ మరణం కాదు.. మగతనాన్ని పెంచే స్టెరాయిడ్స్ ఇచ్చారు: డాక్టర్ కుసుమరావు

  • ప్రభుత్వ కార్యకలాపాల్లో లక్ష్మీపార్వతి ఎక్కువగా జోక్యం చేసుకునేవారు
  • ఆమె సలహా మేరకే చంద్రబాబును పదవి నుంచి ఎన్టీఆర్ తొలగించారు
  • ఎన్నో జన్మల పుణ్యం వల్లే ఎన్టీఆర్ భార్య కాగలిగారు

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మరణంపై డాక్టర్ కుసుమరావు సంచలన విషయాలను వెల్లడించారు. ఆయన మరణం సహజమైంది కాదని ఆమె తెలిపారు. మగతనాన్ని పెంచే స్టెరాయిడ్స్ ను ఎన్టీఆర్ కు ఇచ్చారనే చర్చ మెడికల్ సర్కిల్స్ లో జరుగుతోందని చెప్పారు. ఎన్టీఆర్ భౌతికకాయాన్ని తొలుత చూసిన వ్యక్తుల్లో తాను కూడా వున్నానని తెలిపారు.

ఎన్టీఆర్ చనిపోయారనే వార్త తనకు ఉదయం 5 గంటలకు తెలిసిందని... 7 గంటలకల్లా తాను అక్కడకు చేరుకున్నానని చెప్పారు. ఆయన ముఖం డబుల్ సైజులో ఉందని, కళ్లు కప్ప కళ్లులా బయటకు ఉబ్బాయని, ఫేస్ మొత్తం డార్క్ అయిపోయిందని తెలిపారు. సహజ మరణమైతే ఇలా ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. రాత్రి 10 నుంచి 10.30 గంటల మధ్యలో ఆయన చనిపోయారనే సమాచారం తన వద్ద ఉందని చెప్పారు.

ఇదే సమయంలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిపై కుసుమ విమర్శలు గుప్పించారు. అప్పటి ప్రభుత్వ కార్యకలాపాల్లో లక్ష్మీపార్వతి ఎక్కువగా జోక్యం చేసుకునేవారని చెప్పారు. లక్ష్మీపార్వతి సూచనతోనే చంద్రబాబును మంత్రి పదవి నుంచి, పార్టీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి ఎన్టీఆర్ తొలగించారని ఆరోపించారు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకోబట్టే ఎన్టీఆర్ భార్యగా లక్ష్మీపార్వతి నిలవగలిగారని చెప్పారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకంకు డాక్టర్ కుసుమ చాలా క్లోజ్ ఫ్రెండ్ కావడం గమనార్హం.

ntr
death
steroids
lakshmi parvathi
kusuma rao
Chandrababu
  • Loading...

More Telugu News