Jagan: నేడు ప్రచారానికి బ్రేక్ ఇచ్చిన జగన్... కారణమిదే!

  • వరుస ప్రచారంతో జగన్ గొంతు బొంగురు
  • నేడు ప్రచారానికి, పర్యటనలకు విశ్రాంతి
  • నేతలతో సమావేశమై వ్యూహరచన

ఏపీలో అధికారాన్ని సాధించాలన్న పట్టుదలతో నిత్యమూ కనీసం రెండు, మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేసుకుంటూ వస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, నేడు విశ్రాంతి తీసుకోనున్నారు. వరుస సభల కారణంగా ఆయన గొంతు బొంగురుపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నేడు ఆయన తదుపరి ఎన్నికల వ్యూహాలపై పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై చర్చించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆపై జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి, ఇప్పటివరకూ జరిగిన ప్రచార సరళిపైనా చర్చించనున్నారు.

Jagan
Campaign
Holiday
Break
  • Loading...

More Telugu News