Narendra Modi: జుత్తు ఎర్రగా ఎందుకు లేదన్న మోదీ.. సమాధానం చెప్పిన దత్తాత్రేయ.. క్షమించమన్న ప్రధాని

  • జుత్తు ఎర్రగా ఎందుకు లేదని దత్తాత్రేయకు ప్రశ్న
  • తన కుమారుడు చనిపోవడంతో హోలీ ఆడలేదన్న దత్తాత్రేయ
  • గుర్తు లేకుండా అడిగినందుకు క్షమించాలన్న మోదీ

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సోమవారం సాయంత్రం బీజేపీ నిర్వహించిన విజయ్ సంకల్ప్ సభకు ప్రధాని మోదీ హాజరై ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన మోదీ.. అంతకుముందు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయతో ముచ్చటించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ తలవైపు చూస్తూ.. హోలీ తర్వాత రెండు మూడు నెలల వరకు మీ జుత్తు ఎర్రగా ఉండేదని, ఇప్పుడు తెల్లగా ఎందుకుందని ప్రశ్నించారు. ఇటీవల తన కుమారుడు చనిపోవడంతో హోలీ ఆడలేదని, తన జుత్తు తెల్లగా ఉండడానికి అదే కారణమని దత్తాత్రేయ బదులివ్వడంతో మోదీ అయ్యో అంటూ బాధపడ్డారు. ఆ వెంటనే క్షమించాలని, తనకు ఆ విషయం జ్ఞాపకం లేకపోవడం వల్లే అలా ప్రశ్నించానని, ఏమీ అనుకోవద్దని మోదీ కోరారు.

Narendra Modi
BJP
Hyderabad
Dattatreya
Holi
Telangana
  • Loading...

More Telugu News