BJP: వయనాడ్‌లో రాహుల్‌కు ప్రత్యర్థిగా బీజేపీ మిత్రపక్ష నేత తుషార్

  • రాహుల్‌కు పోటీగా బీడీజేఎస్ అభ్యర్థి తుషార్ వెల్లపల్లి పోటీ
  • ప్రకటించిన బీజేపీ చీఫ్ అమిత్ షా
  • ఆయనో డైనమిక్ లీడర్ అని ప్రశంస

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈసారి ఉత్తరాదితోపాటు దక్షిణాది నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి బరిలో ఉన్న రాహుల్ కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీలో ఉన్నారు. రాహుల్ ఎక్కడి నుంచి బరిలోకి దిగితే తాను కూడా అక్కడి నుంచే పోటీ చేస్తానన్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కాకుండా.. తమ మిత్ర పక్షమైన భారత్ ధర్మ జనసేన (బీడీజేఎస్) అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది.

రాహుల్‌పై తుషార్ వెల్లపల్లి  పోటీ చేస్తున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. ఈ విషయం చెప్పడానికి గర్విస్తున్నానని షా పేర్కొన్నారు. అభివృద్ధి, సామాజిక న్యాయం వంటి బీజేపీ అంశాలను ఆయన సమర్థంగా ప్రజలలోకి తీసుకెళ్లగలరని, ఆయనో డైనమిక్ లీడరని షా కొనియాడారు.

BJP
Kerala
wayanad
Rahul Gandhi
Congress
thushar vellappally
  • Loading...

More Telugu News