Chandrababu: నేను రాజీనామా చేసింది ఆ నమ్మకంతోనే: సోమిరెడ్డి

  • నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి విస్తృత ప్రచారం
  • ఆర్థిక లోటులో ఉన్నా సంక్షేమ పథకాల అమలు
  • అందరికీ అన్ని పథకాలు అందిస్తున్న ఘనత బాబుదే

ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న మంత్రి, సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తోటపల్లి గూడూరు మండలంలోని మాచర్లవారిపాళెం, మల్లికార్జునపురం, ఈదూరు, వరకవిపూడి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి పనులపై నమ్మకంతోనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో 16 వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటుతో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల విషయంలో ఎవరికీ ఎటువంటి లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత చంద్రబాబుదేనని సోమిరెడ్డి పేర్కొన్నారు.

Chandrababu
Nellore District
Somireddy chandramohan reddy
Andhra Pradesh
Telugudesam
  • Loading...

More Telugu News