Janasena: నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిన సినీ డైరెక్టర్లు

  • ఎన్నికలకు 10 రోజులే సమయం
  • ప్రచార జోరును కొనసాగిస్తున్న పార్టీలు
  • జనసేన విజయానికి సహకరిస్తామన్న డైరెక్టర్లు

పార్టీలన్నీ ప్రచార జోరును కొనసాగిస్తున్నాయి. ఎన్నికలకు 10 రోజులే సమయం ఉంది. కానీ ఇప్పటికీ ప్రధాన పార్టీల్లోకి అభ్యర్థులు చేరుతూనే ఉన్నారు. నేడు వైసీపీలో కొందరు సినీ తారలు చేరగా, సినిమా డైరెక్టర్లు మాత్రం జనసేనను ఎంచుకున్నారు.

జనసేన నరసాపురం లోక్‌సభ అభ్యర్థి, సినీ నటుడు నాగబాబు సమక్షంలో సినీ దర్శకులు రమేష్, గోపీ ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, జనసేన విజయానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. టాలీవుడ్ లో తరుణ్, ఓవియా జంటగా తెరకెక్కిన 'ఇది నా లవ్ స్టోరీ' చిత్రానికి రమేష్, గోపీ దర్శకత్వం వహించారు.

Janasena
Nagababu
Ramesh
Gopi
Pawan kalyan
  • Loading...

More Telugu News